Saturday, August 21, 2010
కలిసుండెదెవరు.............. విడిపొయేదెవరు.................
" రాజ కీయ నిరుద్యోగులు " సెప్టెంబర్ 2009 తరువాత ఈ మాట విననివారు బహుశా అరుదుగా వుంటారు మన తెలుగునాడులొ (అంధ్ర అంటే అదొక ఇష్యూ అవుతుంది). ప్రజా ప్రతినిథులై వుండి నిజంగా ప్రజలేంకోరుకుంటున్నరో వీళ్ళకు పట్టదు. వారి అభీష్టాలను ప్రజల కోరికలుగా చిత్రీకరిస్తారు . ఏ రాష్ర్టం లో వున్నా ప్రజలు కొరుకునేది ఒకటే, మొదట వారి వారి కుటుంబం బావుండాలని, తరువాత ఊరు బావుండాలని .. . ఆ ఆకాంక్షలోంచి పుట్టిందే "ప్రజాస్వామ్యం". "ప్రజలకోసం ప్రజల్లోంచి పుట్టే వాడు నాయకుడు. కానీ" ఇప్పుదు ట్రెండ్ మారింది. "తన కోసం ప్రజల్లోంచి పుట్టాననిపించుకునేవాడే నాయకుడు."
"రెండు ప్రాంతాల వారు కలిసి కనీసం భోజనం చేసే పరిస్థిలెదు " ఈ మాట అన్నది ఒక ప్రజా ప్రథినిధి. ఇక్కడ "రెండు ప్రాంతాల వారు అంటే" ప్రజలు కారు నాయకులని అర్ధం. ఎందుకంటే, అందరూ అంధ్ర ప్రదేశ్ ప్రజా ప్రతినిధులై వుండి వీరప్ప మొయిలి ఇచ్చిన విందులో, కలిసి భోంచేయ లేక పొయారు కాబట్టి. కానీ రెండు ప్రాంతాల ప్రజలు మత్రం పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ సఖ్యత లేనిది ప్రజల కా? నాయకుల కా?
కాబట్టి "తనకొసం ప్రజల్లోంచి వచ్చిన నాయకుల కోసం మన తల్లిదంద్రుల చే కన్నీళ్ళు పెట్టించవద్దని మనవి".
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment